Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలుపురం మున్సిపల్ కార్యాలయంలో గుత్తేదారుల ఆందోళన ...

పురం మున్సిపల్ కార్యాలయంలో గుత్తేదారుల ఆందోళన -బిల్లులు ఇవ్వకపోవడంతో ఫర్నిచర్ ధ్వంసం -కమిషనర్ హామీతో శాంతించిన గుత్తేదారులు

హిందూపురంటౌన్ :అప్పులు చేసి చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక, అప్పులకు వడ్డీ పెరిగిపోవడంతో కడుపు మండిన గుత్తేదారులు సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆందోళనకు దిగి దాడికి ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పురపాలక సంఘ వ్యాప్తంగా తాము చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను సి ఎఫ్ ఎం ఎస్ లో అప్ లోడ్ చేయడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రూ. కోట్లల్లో బిల్లుల చెల్లింపు నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గుత్తేదారుల అందోళనను అధికారులు పట్టించు కోకపోవడంతో సహనం కోల్పోయిన గుత్తేదారులు మున్సిపల్ కార్యాలయంలోని అకౌం టెంట్ గదిలోకి దూసుకెళ్లి గది కిటికీ అద్దాలు, టేబుల్ మీద ఉన్న అద్దం, ఫర్నిచర్ తో పాటు కంప్యూటర్ మానిటర్ సైతం పగులు కొట్టారు. ఆందోళన ఉధృతం కావడంతో మున్సిషల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి పోలీసులకు సమాచారం అందించారు. వారు వెం టనే రంగంలోకి దిగి ఆందోళన చేస్తున్న గుత్తేదారులకు నచ్చజెప్పి, మున్సిపల్ కమిషసర్ శ్రీకాంత్ రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. గత 8 నెలల నుంచి చేసిన అభివృద్ధి పసులకు సంబందించిన బిల్లులను మున్సిపల్ కార్యలయంలోని అకౌంట్స్, ప్రీ ఆడిట్ అధికారు లు సకాలంలో సీఎఫ్ఎంఎస్ లో అప్ లోడ్ చేయక పోవడంతో తమకు బిల్లులు ఆర్థిక సంవత్సరం ముగిసినా రాలేదని ఆగ్రహించి మున్సిపల్ కార్యాలయంలో గుత్తేదారులు ఆందోళన చేసి, అకౌంట్స్ విభాగంలో ఫర్నిచర్స్ ధ్వంసం చేసి, గదికి తాళం వేసి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా గుత్తేదారులు ప్రభాకర్, బాలాజీలు మాట్లాడుతూ, పురపాలక సంఘంలో 15 మంది గుత్తేదారులు గత 8 నెలల కాలంగా అప్పులు చేసి దాదాపు రూ.3కోట్ల అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని కోరుతున్నప్పటికీ అకౌంట్స్ విభాగం అధికారులు ఒకరిపై ఒకరు వేసుకుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. చేసిన అన్ని పనులకు బిల్లులు చేయలేదని, కేవలం రూ.1.24 కోట్ల బిల్లులు మాత్రమే సిఎఫ్ఎంఎస్ లో అప్ లోడ్ చేశారన్నారు. ఇంకా దాదాపు రూ. 2 కోట్ల వరకు చేసిన పనులకు బిల్లులు అప్ లోడ్ చేయలేదన్నారు. అప్ లోడ్ చేసిన బిల్లులను సైతం ప్రీ ఆడిట్ లో విధులు నిర్వహిస్తున్న రవి శంకర్ తనకు మామూళ్లు ఇవ్వలేదని, అప్రూ చేయక పోవడంతో అవి సైతం నిలిచిపోవడం జరిగిందన్నారు. తాము ఏదో మిగులుతుందని అప్పులు చేసి మరీ అభివృద్ధి పనులు చేశామని, మార్చి నెలలో అన్ని బిల్లులు వస్తాయని, ఏప్రిల్ లో చెల్లించాల్సిన అప్పులను చెల్లిస్తామని అందరికి చెప్పడం జరిగిందన్నారు. ఒక్క బిల్లు సిఎఫ్ఎంఎస్ అప్ లోడ్ కాక పోవడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి తన చాంబర్ లో గుత్తేదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుత్తేదారులు కమిషనర్ తో మాట్లాడుతూ గత ఎన్నో సంవత్సరాలుగా మున్సిపల్ పరిధిలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేశాము, గతంలో ఎప్పుడూ లేని విధంగా అకౌంటెంట్ , ప్రీ ఆడిట్ అధికారులు తమ బిల్లుల విషయంలో నిర్లక్ష్యం చేయడంతో కడుపు కాలి తిరగబడ్డమన్నారు. ఇంత జరుగుతున్నా తన దృష్టికి ఎం దుకు తీసుకురాలేదని కమిషనర్ అడిగితే, ప్రతి రోజు అకౌంట్, ఫ్రీ ఆడిట్ అధికారులు మేము చేస్తామని చెప్పడం తో మీ దృష్టికి తీసుకు రాలేదని, కమిషన్ కోసం ఇలా చేస్తారని ఊహించలేదన్నారు. అన్ని మున్సిపల్ కార్యాలయాల్లో అకౌంట్ విభాగం ఉద్యోగులు ఫ్రీ ఆడిట్ అధికారులను కలిసి బిల్లులు చేస్తుంటే… ఇక్కడ మాత్రం అలా చేయడం లేదని, ఉగాది, రంజాన్ పండుగలు ఉన్నాయని, కార్మికులకు డబ్బులు ఇవ్వాలి ఎక్కడి నుంచి తీసుఊకోచ్చి ఇవ్వాలో అర్థం కావడం లేదని వాపోయారు. సమస్యను సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలే తప్ప ఇలా కార్యా లయం పై దాడి చేయడం వల్ల బిల్లులు వస్తాయా, సి ఎఫ్ ఎం ఎస్ క్లోజ్ అయిన అనంతరం సమస్యను మా దృష్టికి తీసుకొచ్చారు , పరిష్కారం చూపక ముందే ఇలా చేయడం తగదని కమిషనర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పురపాలక సంఘాల్లో బిల్లుల మంజురైనా ఇక్కడ మాత్రం ఫ్రీ ఆడిట్ అధికారి రవి శంకర్ నిర్లక్ష్యం వల్ల అందరం రోడ్డున పడ్డామని, రవి శంకర్ ఉంటే తాము అభివృద్ధి పసులు చేయలేమన్నారు. ఏడు నెలల నుంచి బిల్లులు మంజూరు కాలేదని, ప్రతిరోజు అకౌంట్స్ విభాగానికి వెళ్లి సమస్యలు వివరిస్తున్నప్పటికీ చేద్దాం, చూద్దామన్నారు తప్ప పరిష్కరించలేదని కాంట్రాక్టర్లు అవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారితే తమ బిల్లులు మంజూరు కాక పోతే ఎవరు బాధ్యత వహిస్తారని కమిషనర్ ను గుత్తేదారులు అడిగిన వారు. ఇకపై ఇలాంటి తప్పిదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని, ఇప్పటి వరకు చేసిన పనులకు బిల్లులు మంజూరు అయ్యే విధంగా తాము చర్యలు తీసుకుంటామన్నారు. అదే విధంగా ఇంజనీరింగ్ విభాగం అధికారులు అకౌంట్స్ విభాగానికి పంపించే ప్రతి ఫైలు కు సంబంధించి రిజిస్టర్ ఏర్పాటు చేయాలని, అకౌంట్ విభాగం రెండు రోజుల్లో వాటిని పరిష్కరించాలని, బిల్లులకు తగిన ఆధారాలు లేకపోతే వెనక్కి అయినా పంపే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. దీంతో పాటు ట్రీ ఆడిట్ అధికారిపై వారి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. దీంతో గుత్తేదారులు శాంతించి వెనక్కి వచ్చారు. అయితే ఫర్నిచర్ ధ్వంసం పై కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి వివరణ కోరగాజరిగిన సంఘటనపై పరిశీలించి వారిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article