
పిఠాపురం పట్టణంలో 30 వార్డులు సుమారు 50 వేల మంది జనాభా వున్నారు. పురపాలక సంఘం పారిశుద్ధ్య కార్మికులు 150 మంది వుండవలసిన సిబ్బంది 70 మంది వున్నారు వీధులు శుభ్రం చేయటానికి సరిగ్గా వర్కర్స్ లేకపోవటంతో పట్టణంలో అన్ని వార్డులు మురుగునీరుతో నిండిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో డయేరియా, అతిసార వ్యాధులు ప్రభాలి ప్రజలు ఆసుపత్రి పాలు అవుతున్నారు, కొంత మంది ప్రాణాలు వదిలేశారు. పురపాలక సంఘం అధికారులకు ప్రస్తుత పాలకులకు ఎన్నిసార్లు వి విన్నవించుకున్న పట్టించుకోవటం లేదు.
గతంలో మాజీ శాసన సభ్యులు SVSN. వర్మ టీడీపీ కార్యకర్తలతో కలిసి ఒకరోజు మురుగు కాలువ ప్రక్కన పడుకొని నిరసన తెలియచేశారు. అలాంటి వారి పైన కేసులు పెట్టారు అదీ పురపాలక సంఘం అధికారులు తీరు ఇప్పటికైనా అధికారులు పనితీరులో మార్పు రాకపోతే ప్రజలు తిరగబడే పరిస్తులు కనిపిస్తున్నాయి





