,విజయవాడ:
విజయవాడలోని పత్రిక సమాచార కార్యాలయ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా పి రత్నాకర్ బుదవారం బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ మరియు ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు(పిఆర్‌జిఐ) డిప్యూటీ ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్‌గా కూడా ఆయన అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు.ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐఐఎస్) సీనియర్ అధికారి అయిన రత్నాకర్ పిఐబిలో బాధ్యతలు స్వీకరించడానికి ముందు విజయవాడలోని సిబిసి ప్రాంతీయ కార్యాలయంలో డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన వివిధ క్షేత్ర ప్రచార విభాగాలు మరియు వార్తా విభాగాలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. తన సర్వీసులో విజయవాడలోని దూరదర్శన్ న్యూస్ ప్రాంతీయ వార్తల విభాగం, హైదరాబాద్ పిఐబి మరియు కడపలో ఫీల్డ్ పబ్లిసిటీ డైరెక్టరేట్ అధిపతిగా కూడా పనిచేశారు.రాష్ట్రంలోని పిఆర్‌జిఐకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రచార కార్యకలాపాలు, క్షేత్ర ప్రచార కార్యకలాపాలు మరియు ప్రింట్ మీడియా సంస్థలకు సంబంధించిన వివిధ కార్యకలాపాలను తన కొత్త హోదాలో సమన్వయం చేస్తానని రత్నాకర్ తెలియజేశారు .
*