చంద్రగిరి: పాకాల మండలంలో ఇంటింటి ప్రచారంలో పులివర్తి నాని పాల్గొన్నారు.
సోమవారం మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని, బాబు ఘారిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన పాకాల మండలం, సామిరెడ్డిపల్లి, బండపాకాల, కోనపరెడ్డిపల్లి, తోటపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, బిజెపి నాయకులు, యువకులు ఆయనకు స్వాగతం పలికారు. పులివర్తి నాని
ఇంటింటా తిరుగుతూ కూటమి అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి ప్రజలకు తెలియజేశారు. సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయన్నారు. పంచాయతీలలో సర్పంచ్ లు అధికారాలు పూర్తిగా కోల్పోయారని తెలిపారు. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే పంచాయతీలను బలోపేతం చేస్తామని తెలిపారు.సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పులివర్తి నాని కోరారు.
