కడప సిటీ
రానున్న ఎన్నికల సందర్బంగా పల్లె పల్లెకు బిజెపి గడపగడపకు కమలం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు భాజపా జిల్లా అధ్యక్షులు శశిభూషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు భాజాపా కార్యాలయం లో బీజేపీ నాయకులతో కలసి పల్లెకు పోదాం కరపత్రాన్ని గురువారం విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 9,10,11 తేదీలలో పల్లెకుపోదాం బిజెపి కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు.దేశంలో ఉన్న బాధ్యత గల ప్రతి కార్యకర్త మూడు రోజులు వారికి కేటాయించిన గ్రామాలకు వెళ్లి పనిచేయాలని చెప్పారు. నరేంద్రమోడీ గత పది సంవత్సరాల లో చేసిన అభివృద్ధి,వివిధ సంక్షేమ పధకాల గురించి ప్రతి ఇంటికివెల్లి వివరించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ది పొందిన వారిని కలిసి అభివృద్ధి సంక్షేమం గురించి వివరించాలని చెప్పారు.ప్రతి ఒక్కరికి మోడీ గారి సందేశం వినిపించాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ ని 3వ సారి గెలిపించి దేశాన్ని ముందుకు నడిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు. గ్రామం, రాష్ట్రం,దేశం అభివృద్ధి చేయాలంటే నరేంద్ర మోడీ ప్రభుత్వమే శరణ్యమని అన్నారు రాష్ట్రంలో ఉన్న అవినీతి అసమర్ధ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించించ డానికి ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ లక్ష్మీనారాయణ రెడ్డి బిజెపి కడప కన్వీనర్ మధుసూదన్ రెడ్డి,గాలి హరి, పవన్, మునగా సతీష్, సమీరా నూరుద్దీన్ , లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.