లేపాక్షి : శిల్పకళారమంగా పేరొందిన లేపాక్షి వీరభద్రాలయాన్ని పరిపూర్ణానంద స్వామీజీ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహ శర్మ శ్రీనివాస్ కుమార్ లు స్వామీజీకి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామీజీకి ఆలయ చరిత్రను వివరించారు. ఆలయంలోని శాసనాలు, చవితి వినాయకుడు, ఏడు పడగల నాగేంద్రుడు, అసంపూర్తి కళ్యాణ మండపం, అందులో శివపార్వతుల కళ్యాణ ఘట్టం వివరించారు. లతా మంటపంలోని లేపాక్షి డిజైన్ లను స్వామీజీకి తెలిపారు. అనంతరం నాట్యమంటపంలోని శిల్పాలు,తైల వర్ణ చిత్రాల చరిత్రను స్వామీజీకి వివరించారు. నాట్యమంటపంలో వేలాడే స్తంభం తిలకించి స్వామీజీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు . అనంతరం దుర్గాదేవి, వీరభద్ర స్వాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు లక్ష్మీ నరసింహ శర్మ, శ్రీనివాస్ కుమార్లు ఆలయ మర్యాదలతో స్వామిజీని సత్కరించారు. స్వామీజీ వెంట పలువురు భక్తులు ఉన్నారు.