- బోనంగి ఫార్మాసిటీ కాలనీలలో దర్జాగా ప్రభుత్వ భూమి కబ్జా అవుతుందా..!
- లోకాయుక్త కేసులో ఉన్నా లోకల్ కోర్టు వేరే ఉందా…
- స్థానిక తహశీల్దార్ ప్రమేయం ఉన్నట్లేనా…?
- కొండపై కట్టడాల కథలో సూత్రధారి పాత్రదారెవరో…
*అడ్డుకట్ట వేయాల్సిన వారే అండగా ఉంటున్నారా…!


ప్రజాభూమి ప్రతినిధి,అనకాపల్లి:
ప్రభుత్వ భూములు పక్కదారి పడుతుంటే పట్టించుకునే నాధుడు లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ స్థలాలో కొంతమంది పెద్దలు రాజకీయ పార్టీల అండదండలు, ఆమ్యామ్యా చేసుకుని అక్రమ నిర్మాణాలు చేపట్టిన తరువాత లోకాయుక్త కోర్టు ను ఆశ్రయించి ఓ వైపు విచారణలో ఉన్నా ఇక్కడ ఏ కోర్టు కూడా లెక్క చేయని కొంతమంది బడాబాబుల దర్జాగా బీల్డింగ్స్ నిర్మిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలోకి వెళితే… పరవాడ బోసంగి పార్మ ప్లాట్ నెంబర్ 326 లో కొండపై చేపట్టిన భారీ నిర్మాణం కు అనుమతులు లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని మీద లోకాయుక్త లో కూడా విచారణ జరుగుతున్న సరే పట్టించుకోకుండా స్థానిక వీఆర్వో కు ఓ పార్టీ నేత కాసులు వర్షం కురిపించి నిర్మాణం చేపడుతున్నారనే విమర్శలు వచ్చిపడుతున్నాయి.
అయితే ప్లాట్ నెంబరు 326 లోకాయుక్తా కోర్టులో రద్దు పరచినట్లుగా తెలుస్తోంది. సదరు పట్టా నిబంధనలకు విరుద్ధంగా పొందిన పట్టా క్యాన్సిలేషన్ చేయబడిన స్థానిక రెవిన్యూ అధికారులు కుమ్మక్కై 500 కోట్లు విలువ చేసే భూమిని దగ్గరుండి నిర్మాణం చేపడుతున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.కొత్తగా వచ్చిన తాసిల్దార్ హయాంలో ఎన్నో ప్రభుత్వ భూములలో నిర్మాణాలు జరిగినప్పటికీ. అవి చాలదనట్లు గా ప్రభుత్వ భూములలో ఆక్రమణ యథేచ్ఛగా సాగిస్తున్నా ,రియల్ ఎస్టేట్ బ్రోకర్ తో డీల్ కుదుర్చుకొని.కొండను అనకొండ లాగా మింగేస్తున్న పట్టి పట్టనట్లు ఉంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కొండను ఆక్రమించినా తమకు అన్ని విధాల అండదండలు ఉన్నాయనే ధీమాతో పేట్రేగిపోతున్నట్లు అక్కడ ప్రజలలో చర్చ నడుస్తోంది. అధికార అంగబలమే ఆసరాగా చూసి మరి భూములు ఆక్రమించి దర్జాగా అక్రమార్కులు నకిలీ డాక్యుమెంట్తోతో తమ ఆధీనంలో ఉంచుకుని. వేరే ఒకరికి అమ్మేస్తూ ఇదే ప్లాట్ నెంబరు 326 లో సుమారు 200 సెంట్లు స్థలంలో భారీగా నిర్మాణం కబ్జా చేసి నిర్మిస్తున్నారనే వాదన కూడ అక్కడ లేక పోలేదు. దీనిపై స్థానికులు రెవెన్యూ అధికారులకి ఫిర్యాదులు.
చేసినప్పటికీ పట్టించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. 200 సెంట్లు కొండ స్థలాన్ని ఆక్రమించుకొని జెసిబి తో చదును చేసి భారీగా రేకుల షెడ్ చేపట్టారు అయితే ఈ స్థలంలో పేదవారి పేరు వాడుకొని అధికారి పార్టీ నాయకుడు దగ్గరుండి మరీ నిర్మాణం చేపట్టాడని . స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని మీద ప్లాట్ నెంబర్ ఎవరికి ఇవ్వకుండా ప్రజల్ని మభ్యపెడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి
పార్టీ అడ్డం పెట్టుకొని అంతా తానే నంటూ పెత్తనం చెలాయించి, అక్రమ నిర్మాణాలకు చేపట్టిస్తున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు . విఆర్వోలు కు కాసులు వర్షం కురిపించి వారు నోరెత్తకుండా
చేస్తున్నరనేది ఇక్కడ చర్చ జరుగుతోంది ఈ నిర్మాణంపై రెవెన్యూ అధికారులు భూమి అక్రమణపై విచారణచేసి, కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురికాకుండా అనకాపల్లి జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

