ఏ ఐ ఎఫ్ టు యు నేత కుంచె అంజిబాబు
గొల్లప్రోలు
ఎన్నికల కరపత్రంగా రాష్ట్ర బడ్జెట్ ఉందని ఏ ఐ ఎఫ్ టి యు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కుంచె అంజిబాబు విమర్శించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఉద్దేశించి అంజిబాబు గొల్లప్రోలు టౌన్ లో జండాలతో రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు.అఅనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో ఎలాగైనా అధికారం చేపట్టాలన్న ఉద్దేశంతో రాష్ట్ర బడ్జెట్లో అంకెలు గారడీలు చేస్తున్నారన్నారు. జగన్ బడ్జెట్ ప్రసంగంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దార్శినిక ఆలోచనలో పాలన అందిస్తున్నామని, సంపన్న ఆంధ్ర, సుపరి పాలన ఆంధ్ర, మహిళ మహారాణి ఆంధ్ర అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. అంబేద్కర్ పేరు చెప్పుకునే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి మళ్ళించారని, ఎస్సీ, బీ.సీల కార్పొరేషన్ లు పెట్టి వాటికి నిధులు కేటాయించకుండా ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని వారు విమర్శించారు. అప్పు తెస్తేనే గాని ఆంధ్రప్రదేశ్ మెయింటినెన్స్, ఉద్యోగుల జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉండి సంపన్న రాష్ట్రం చేసామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. మరోపక్క 20 మంది ఎంపీలను గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా తెస్తానని ఇచ్చిన మాటను తప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తల ఓగ్గి రాష్ట్రానికి అన్యాయం చేశారన్నారు. ఎన్ని కాకి లెక్కలు చెప్పినా వ్యవసాయ రంగం సంక్షోభంలోనికి నెట్ట వేయబడిందన్నారు.అధిక ధరలతో ప్రజలు అతలాకుతలమవుతుంటే వారిపై వివిధ రకాల పన్నులు విధించి వారిపై భారాల మోపుతున్నారన్నారు. దళిత బలహీన వర్గాల ప్రజలకు , మహిళలకు ,రైతులకు, ప్రజలకు అనుకూలంగా బడ్జెట్ కేటాయింపులు లేవన్నారు.జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలకు, నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని ఈ సందర్భంగా అంజిబాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేశవరపు వీరన్న గుడాల చార్లెస్ గొర్ల శివ బల్ల సోమరాజు మాదేపల్లి ఈశ్వరరావు బర్రె లక్ష్మణ్ పాల్గొన్నారు.