తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికలు సవాల్‌గా మారనున్నాయి. ఓ వైపు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం.. మరో వైపు పార్లమెంట్ ఎన్నికలు రానుండడంతో ఎన్నికల్లో పోటీకి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశంకానుంది. గాంధీభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ హాజరుకానున్నారు.

