మార్కాపురం :మార్కాపురం పట్టణంలోని నెహ్రూ కేంద్రం బ్లాక్ ప్రతినిధి శ్రీధర సాయి సుబ్బారావు ఆధ్వర్యంలో కళాశాల ఎన్ ఎస్ ఎస్ యూనిట్ సహకారంతో సంయుక్తంగా మార్కాపురంలోని ఇందిరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కళాశాలలో బ్లాక్ లెవెల్ క్రీడా పోటీలలో భాగంగా వాలీబాల్ పోటీలను నిర్వహించారు. ఈ యొక్క వాలీబాల్ పోటీలలో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం గెలుపొందిన విజేతలకు సర్టిఫికెట్లను కళాశాల డైరెక్టర్ వెన్న ఇందిర చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా క్రీడాకారులలో నైపుణ్యతను గుర్తించేందుకు ఈ యొక్క పోటీలు ఉపయోగపడతాయని, యువతి యువకులు క్రీడలలో ఉత్సాహంగా పాల్గొని మానసిక శారీరిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని నైపుణ్యతను పెంపొందించుకునేందుకు కృషి చేస్తాయని వెన్న ఇందిరా అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఉషా ఈశ్వరన్, ఎన్ ఎస్ ఎస్ కో ఆర్డినేటర్ పుష్పలత, ఈసీఈ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మల్లేష్, రాయల్ స్పోర్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి బుక్కరాజు రామకృష్ణా, కళాశాల అధ్యాపకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
