Tuesday, February 17, 2026

Creating liberating content

తాజా వార్తలునూతన వధూవరులకు చెవిరెడ్డి పెళ్లి కానుక పంపిణీ..!

నూతన వధూవరులకు చెవిరెడ్డి పెళ్లి కానుక పంపిణీ..!

చంద్రగిరి:
చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యులు,డాక్టర్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరియు తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చంద్రగిరి నియోజక వర్గంలో జరుగుతున్న పెళ్లిళ్లకు సొంత నిధులతో పెళ్లి కానుకను అందిస్తున్నారు. అందులో భాగంగా శనివారం చంద్రగిరి మండలం, రెడ్డి వారి పల్లి పంచాయతీ నందు నివాసం ఉంటున్న దాసరయ్య గారి కేశవులు రెడ్డి కుమార్తె “ డి. నాగలక్ష్మి ” అనే వధువుకీ అలాగే చంద్రగిరి మండలం నరసింగాపురం లో నివాసం ఉంటున్న సీ .మస్తాన్ కుమార్తె”సి. మహిత” అనే వధువుకి 11 వ తేదీ ఆదివారం పెళ్లి సందర్భంగా బంగారు తాళి బొట్టు, బంగారు నల్లపూసల దండ, వెండి మెట్టెలు, వదూ వరులకు బట్టలు, శ్రీ వారి ప్రసాదం లడ్డు, వడ, స్వీట్ బాక్స్ మరియు గ్రీటింగ్ కార్డ్ పంపించడం జరిగింది. ఈ పెళ్లి కానుకను చంద్రగిరి ఎంపీపీ హేమేంద్రకుమార్ రెడ్డి, చంద్రగిరి డివిజన్ అధ్యక్షులు కుప్పిరెడ్డి భాస్కర్ రెడ్డి , రెడ్డివారిపల్లి గ్రామ సర్పంచ్ లు రేవతి ప్రకాష్ రెడ్డి, నరసింగాపురం గ్రామ సర్పంచ్ కే. చెంచురత్నం, వార్డు మెంబర్లు, వాలంటీర్లు మరియు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు చేతుల మీదుగా అందజేయడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article