ప్రొద్దుటూరు స్థానిక పట్టణంలోని ఒకటో వార్డు సచివాలయం నందు ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆరోగ్యశ్రీ పరిమితి రూ.25 లక్షలకు పెంపు, నూతన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్నిఎమ్మెల్యే చేతులమీదుగా పంపిణి చేశారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో ఇది చరిత్రాత్మక నిర్ణయం. ఆరోగ్యం, విద్య అన్నవి ప్రజలకు ఒక హక్కుగా లభించాలి. ఈ హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత. అందుకనే అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ప్రభుత్వం ఈ అంశాలపై విశేష కృషి చేసింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వంచేస్తున్న ఖర్చులే దీనికి ఉదాహరణ. దీంట్లో భాగంగానే వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స కార్యక్రమాన్ని చేపట్టామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా రూ.25 లక్షల వరకూ చికిత్స ఉచితంగా లభిస్తుందన్న భరోసా ఇవ్వాలి. అత్యంత మానవీయ దృక్పథంతో ప్రభుత్వం ఈ విషయంలో ముందడుగు వేస్తోంది. వైఎస్సార్‌ఆరోగ్య శ్రీ కార్డు ఉందంటే.. ఆ వ్యక్తికి రూ.25 లక్షలు వరకూ వైద్యం ఉచితంగా లభిస్తుంది. ఎవరికి ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు వచ్చినా సరే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తుంది’’ అని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు,వార్డు కౌన్సిలర్ పందిటి సరోజమ్మ,,పట్టణాధ్యక్షులు కామశెట్టి బాబు, పట్టణాధ్యక్షురాలు కోనేటి సునంద, నాలుగో వార్డ్ కౌన్సిలర్ వరికూటి ఓబుల్ రెడ్డి, రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, గోన ప్రభాకర్ రెడ్డి,శౌరి రెడ్డి, ప్రజలు, వైసిపి నాయకులు, మహిళలు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.