ఒంటిమిట్ట:
జాతీయ నులిపురుగు నిర్మూలన కార్యక్రమంను ఫిబ్రవరి 9వ తేదీన విజయవంతంగా నిర్వహించాలని, జయప్రదం చేయాలని ఈ ఓ పి ఆర్ డి కుమార రంగయ్య అన్నారు. బుధవారం ఒంటిమిట్ట ఎంపీడీవో కార్యాలయంలో జాతీయ నులిపురుగు నిర్మూలన కార్యక్రమము పోస్టర్ ను విడుదల చేసి నులిపురుగు నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైయస్సార్ కడప జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రమేష్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవం ప్రతి ఏడాది నిర్వహిస్తున్నామని అన్నారు. నులి పురుగు నివారణ మాత్రలను 19 సంవత్సరాల వయసు లోపు ఉన్న ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అన్నారు. నులి పురుగు నివారణ మాత్రలను ప్రతి ఒక్కరూ తీసుకునేలా వైద్య సిబ్బంది, ఇటు విద్యాశాఖ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ మాత్రల వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదని సూచించారు. రెండు సంవత్సరాలకు పిల్లలకు 400ఎంజి మాత్రలు సగం మాత్రమే ఇవ్వాలని, మిగతా పిల్లలకు మధ్యాహ్నం భోజనం తీసుకున్న అరగంట తర్వాత మాత్రలు అందించాలన్నారు. పిల్లలు మాత్రలను మింగకుండా మొదటగా నోటిలో నమిలించి తరువాత మింగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎవరికైనా పిల్లలకు జ్వరముగాని, వాంతులు, విరేచనాలుగానే ఉన్న ఎడల అలాంటి వారికి ఫిబ్రవరి 9న మాత్రలు అందించకూడదన్నారు. ఫిబ్రవరి 16న ఇలాంటి వారికి మరలా అందించడం జరుగుతుందని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా వ్యవహరించి జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు మండల విద్యాశాఖ అధికారి డి ప్రభాకర్, ఒంటిమిట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి హిమ శ్వేత, సూపర్డెంట్ భాష, మండల పరిధిలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యా సిబ్బంది పాల్గొన్నారు.