పరీక్ష ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించబడేలా అవసరమైన అన్ని ఏర్పాట్ల పరిశీలన.
చిత్తూరు, మే 04:ఆదివారం జిల్లా కేంద్రం నందు జరిగిన నీట్ పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాలైన పి వి కె ఎన్ మరియు సావిత్రమ్మ డిగ్రీ కాలేజీ లలో పరీక్షల నిర్వహణ ను మరియు బందోబస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు లతో కలిసి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.’నీట్’ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందనన్నారు.144 సెక్షన్ అమలులో ఉన్నందున పరీక్షా కేంద్రాలకు వంద మీటర్ల పరిధిలో ఎవరూ గుంపులుగా ఉండకుండా చూడాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పి వి కె ఎన్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ జీవన జ్యోతి, సావిత్రమ్మ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డా.మనోహర్, ఏ.ఆర్ డి.ఎస్పీ మహబూబ్ బాష,పరీక్ష చీఫ్ సూపరింటెండెంట్ డా.శరవణ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.