Sunday, February 15, 2026

Creating liberating content

తాజా వార్తలునిర్ణీత గడువు లోపల పనులన్నీ పూర్తి కావాలి

నిర్ణీత గడువు లోపల పనులన్నీ పూర్తి కావాలి

పనులలో నాణ్యత లోపిస్తే ఉపేక్షించేదే లేదు

కలెక్టర్ విజయరామరాజు

ప్రజాభూమి,పులివెందుల
నిర్ణీత గడువు లోపల మోడల్ టౌన్ లో భాగంగా జరిగే పనులన్నీ పూర్తిచేయాలని పనులలో నాణ్యత లోపిస్తే ఉపేక్షించవద్దని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. మంగళవారం పులివెందుల పట్టణంలో జరిగే అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం అన్ని శాఖల అధికారు లతో ఆర్ అండ్ బి అతిథి గృహంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడల్ టౌన్ లో భాగంగా జరుగుతున్న అన్ని పనులను ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షిస్తూ ఉండాలని, అలా కాకుండా నిర్లక్ష్యం వహిస్తే మాత్రం అట్టి వారిపై చర్యలు తీసుకోవడం తప్పదని హెచ్చరించారు. అనంతరం ఇప్పటివరకు జరిగిన పనులను అధికారులు కలెక్టర్ కు వివరించారు. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను ఓ ఎస్ డి అనిల్ కుమార్ రెడ్డితో కలిసి పరిశీలించారు. సంబంధిం చిన అధికారులు అడిగి ఎన్ని రూములు కడుతు న్నారు పనులు ఏ దశలో ఉన్నాయని ఆరాతీశారు. నాణ్యత లోపం లేకుండా పనులు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ వెంకటేశులు, ఎమ్మార్వో మాధవ్ కృష్ణారెడ్డి,అన్ని శాఖల అధికారులు, పురపాలక చైర్మన్ వరప్రసాద్, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ చిన్నప్ప లు,తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article