Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలునిరుద్యోగ యువత జీవితాలను చిదిమేస్తున్న గంజాయి..!

నిరుద్యోగ యువత జీవితాలను చిదిమేస్తున్న గంజాయి..!

నిషాలో ప్రాణాలు కోల్పోయిన 20 మందికి పైగా యువకులు
పదవులు కోసం పంచాయితీలు విడగొట్టి నిధులు స్వాహా
— టీడీపీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డి..

తిరుపతి రూరల్:పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు రాక యువత గంజాయి వాడకం లాంటి చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారని సాయినగర్ పంచాయితీ మహిళలు చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డికి తెలిపారు. సోమవారం సాయినగర్ పంచాయితీలో “మహిళా శక్తికి అండగా” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. సుమారు 20 మందికి పైగా యువకులు గంజాయి మత్తుకు బానిసలై మృతి చెందారని చెప్పారు. సాయినగర్ పార్కుల వద్ద, మైదాన ప్రాంతాల్లో రాత్రిళ్ళు కొందరు గంజాయి, మద్యం మత్తులో దారిని పోయే వారిపై దౌర్జన్యాలకు దిగుతున్నారని విన్నవించారు. ఫిర్యాదు చేయాలన్న గంజాయి బ్యాచ్ ఆగడాలకు భయపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇంత జరుగుతున్నా పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఏ రోజు వచ్చిన దాఖలాలు లేవన్నారు. అలాగే డ్రైనేజ్, తాగునీరు సమస్యలు పట్టి పీడిస్తున్నాయని చెప్పారు. అనంతరం పులివర్తి సుధారెడ్డి మాట్లాడుతూ త్వరలో సాయినగర్ పంచాయితీ రూపురేఖలు మారనున్నాయని, తిరుపతి మహా నగరానికి ఆనుకుని ఉన్న పంచాయితీకి మహర్దశ పట్టునుందని పేర్కొన్నారు.
ఏళ్ల తరబడి వేదిస్తున్న మురుగు కాలువల సమస్యకు శాశ్వత పరిష్కారంగా అండర్ డ్రైనేజ్ సిస్టమ్ నా భర్త పులివర్తి నాని ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు. అర్హులైన లబ్దిదారులకు పాడిపేటలో ఇళ్లు నిర్మించి అందజేస్తామని హామీ ఇచ్చారు. తాగునీరు సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం లభిస్తుందని భరోసా ఇచ్చారు.
తాగునీరు, పేదలకు ఇళ్లు, కాలువలు నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల కల్పించడంలో కూడా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విఫలమయ్యారని పులివర్తి సుధారెడ్డి ఆరోపించారు. మళ్లీ అధికారంలోకి రామన్న వాస్తవాన్ని గ్రహించి వేల కోట్లు దోచుకుని ఒంగోలుకు మకాం మర్చేశారని విమర్శించారు.
పదవుల కోసం ఒక్కో పంచాయితీను రెండు, మూడు పంచాయితీలు గా విడగొట్టి నిధులు దుర్వినియోగం చేశారని అన్నారు. ఐదేళ్ల రూలింగ్ లో ఉన్న 70 శాతం పల్లెలో స్మశాన వాటికలు లేక పోవడం శోచనీయమన్నారు. సాయినగర్ పంచాయితీ సమస్యలు అన్ని పులివర్తి నాని ఇంటింటి పర్యటనలో సేకరించారని గుర్తు చేశారు. పులివర్తి నాని ప్రతి సమస్యను అధ్యయనం చేశారని మేజర్ సమస్య అండర్ డ్రైనేజ్ సిస్టమ్, తాగునీరు, గంజాయి, రౌడీయిజం గా గుర్తించారని చెప్పారు. ప్రతి సమస్యకు దగ్గరుండి పరిష్కారం చూపుతారని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అండర్ డ్రైనేజ్ పనులు ప్రారంభిస్తారని అన్నారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి పులివర్తి నానిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article