వి.ఆర్.పురం
ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన మహిళలకు పోలీసు వారి ఆధ్వర్యంలో ఉద్యోగ కల్పన అవకాశాన్ని కల్పిస్తున్నారని, ఈ అవకాశాన్ని ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, ఎస్ ఐ వెంకట్ అన్నారు. స్థానిక రేఖపల్లి జంక్షన్ వద్ద ఎస్ ఐ స్థానిక ప్రజలతో ప్రేరణ కార్యక్రమంలో భాగంగా జాబ్ మేళా పై అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసు వారి ఆధ్వర్యంలో, ప్రశాంతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వారి సహకారంతో నిరుద్యోగ గిరిజన మహిళలకు టాటా టెక్నాలజీస్ సంస్థ నందు ఉచిత శిక్షణ మరియు ఉద్యోగ కల్పన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, ఈ జాబ్ మేళాలో అర్హులైన నిరుద్యోగ గిరిజన మహిళలను ఎంపిక చేసి, వారికి శిక్షణను ఇచ్చి ఉద్యోగ అవకాశం కల్పిస్తారని ఈ అవకాశాన్ని ప్రతీ నిరుద్యోగ గిరిజన మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

