Saturday, September 13, 2025

Creating liberating content

తాజా వార్తలునిజాలా..ఇజాలా..!?

నిజాలా..ఇజాలా..!?

అడవిలోకి గొడ్డలి వచ్చింది..
వెంటనే చెట్లన్నీ మురిసిపోయాయి..
మొన ఇనుముదైనా..
పట్టుకునేది మా కర్రే కదాని..
ఆ సంబరం కాసేపే..
అంతలోనే కర్రే పట్టుగా గల గొడ్డలి ఆ చెట్లను నిర్దాక్షిణ్యంగా
నరికి పడేసింది..ద్రోహి తమ రూపంలోనే ఉన్నాడని
చెట్లకు అప్పటికి ఎరుకైంది..

పిల్లాడు పెరిగి పెద్దయ్యే పాటికి
అతడు రాతకు ఉపయోగించే
పెన్సిల్ పెన్నుగా మారింది..
ముందు సంబరం అనిపించినా
అనతికాలంలోనే తెలిసివచ్చింది గుంటడికి..
ఇక తప్పును చెరిపేసుకోడం
జరిగే పని కాదని..

పెంచిన ప్రేమ గొప్పదని అంటారు..కానీ తనలో
పెరిగిన చేపని నీళ్లు తనలోనే
మరగపెట్టేసుకుని కూరగా
మార్చేస్తుంటే ఏమనుకోవాలి..

జీవితాంతం కాపరి రక్షణలో ఉండి..ఇతర జంతువులకు
భయపడుతూ గడిపే
గొర్రెలు..చివరికి ఆ కాపరి
చేతిలోనే మరణించడం
జీవితం నేర్పే విలువైన
పాఠాల్లో ఒకటి..

నా పిచ్చి గాని..
RIP కి నేనే అర్ధం మార్చేసుకుని rest in peace బదులుగా return if possible అనేసుకుంటే మాత్రం ఎంత స్నేహితుడైనా గాని తిరిగి వచ్చేస్తాడా..
అంతకంటే rest in peace
అని సరిపెట్టుకోడమే బెటర్..

జీవితంలో అతి చేదు వాస్తవం ఏంటంటే..నువ్వు ఎంతో గొప్పగా కలలు గనే
భవిష్యత్తులో నీకు
అణుమాత్రమైనా చోటుండదు..

నీ తండ్రి మరణించిన రోజున..
ఒక్క విషయం తెలుసుకో..
నిన్ను తన కంటే ఉన్నతమైన స్థితిలో చూడాలనుకునే
గొప్ప త్యాగి
ఇక నీ వెంట..
నీ ముందు..
ఆమాటకొస్తే నీతో
ఇక ఉండడని..

తన బాధ అందరికీ తెలియాలని చిన్నప్పుడు బిగ్గరగా ఏడ్చే ప్రాణి..
పెద్దయ్యాక అదే బాధ
ఎవరూ గుర్తించకూడదని
లోలోపలే కుమిలిపోతూ
ఉంటుంది..

ఈరోజుల్లో నీ కుటుంబంలోనే
నువ్వు ఒక సభ్యుడిగా ఉండాలంటే..కొనసాగాలంటే
నువ్వు ఖచ్చితంగా బాగా సంపాదించి ఉండాలి..
ఫ్యామిలీ మెంబర్ కావాలంటే
గట్టిగా membership fees
కట్టగలిగే స్థితిలో
ఉండాలన్న మాట..

కుటుంబం అనేది అడవి లాంటిది..పైనుంచి లేదా దూరం నుంచి చూస్తే
చెట్లన్నీ ఒక్కటిగా పక్కపక్కనే
ఉన్నట్టు కనిపిస్తాయి..
లోపలికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది..ఆ చెట్ల మధ్య
ఎంత ఎడం ఉందనేది..

సురేష్..9948546286
7995666286

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article