భువనేశ్వరి కి పుష్పగుచ్చం అందిస్తున్న పోకా నాయుడు…
కనిగిరి
టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమానికి రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని టి ఎన్ ఎస్ వి మాజీ జిల్లా కార్యదర్శి పోక నాయుడు బాబు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించిన సందర్భంలో పలువురు అక్రమ అరెస్టును జీర్ణించుకోలేక గుండెపోటుతో మృతి చెందారు అట్టి కుటుంబాలను ఆదుకునేందుకు నారా భువనేశ్వరి రాష్ట్రవ్యాప్తంగా నిజం గెలవాలని కార్యక్రమంతో బాధిత కుటుంబాలను ఓదార్పు చేసే కార్యక్రమం విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరులో నిజం గెలవాలి కార్యక్రమం గురువారం ఆమె చేపట్టారు ఈ సందర్భంగా నిజం గెలవాలి కార్యక్రమంలో నేను పాల్గొని భువనేశ్వరి గారికి అభినందిస్తూ పుష్పగుచ్చం అందజేశాను ఈ సందర్భంగా మాట్లాడుతూ మన టిడిపి సోషల్ మీడియా వేదికగా అధికార పార్టీ చేస్తున్న అరాచక అక్రమాలపై ప్రజలను చైతన్యపరిచి రానున్న సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ, జనసేన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఆమె సూచించినట్లు పోక నాయుడు తెలిపారు.