కామవరపుకోట/చింతలపూడి :చింతలపూడి మండలంలో కాంతంపాలెం, వెంకటాపురం, వెంకటాద్రిగూడెం లో వైసీపీ అభ్యర్థి కంభం విజయరాజు ఎన్నికలు పర్యటన నామినేషన్లకు ముందే ఎన్నికల ప్రచార పర్యటన హోరెత్తించారు.చింతలపూడి వైసీపీ సెంట్రల్ ఆఫీస్ నుండి ప్రచార రధం తో పాటు భారీ బైక్ ర్యాలీ తో మూడు గ్రామాలులో వందలాదిమంది పర్యటన చేశారు.వైసీపీ అభిమానులు మండుటెండా సైతం లెక్క చేయకుండా ప్రచారం లో పాల్గొన్నారు.
వీరితో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ జానకిరెడ్డి , జడ్పీటీసీ నీరజ , ఎంపీపీ రాంబాబు , టౌన్ అధ్యక్షులు కొప్పుల నాగు , మండల సచివాలయలా కన్వినర్ మామిళ్లపల్లి రాంబాబు ,ఎంపీటీసీ చింతం కృష్ణరావు, ఆర్ వి వి రామారావు , ఖాదర్ బాబు ,రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి దినేష్ రెడ్డి, మండల భూత్ కన్వినర్ భరత్ రెడ్డి, టౌన్ భూత్ కన్వినర్ చెంచంరాజు, మరియు పలువురు సీనియర్ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.