లేపాక్షి: మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించకపోతే వేటు తప్పదని ఎంఈఓ లు నాగరాజు పేర్కొన్నారు. శనివారం స్థానిక ఎంఆర్సి కార్యాలయంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులకు ,సహాయకులకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రయోగాత్మకంగా అన్నాన్ని, కూరలను ఏ విధంగా వండాలో చేసి చూపించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎంఈఓ నాగరాజు మాట్లాడుతూ, మధ్యాహ్న భోజనాన్ని నాణ్యత తో పాటు రుచికరంగా వండాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారమే విద్యార్థులకు భోజనాన్ని వడ్డించాలన్నారు. ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మధ్యాహ్న భోజన పథకానికి ఏజెన్సీలు గండి కొట్టాలని ప్రయత్నిస్తే అట్టి వారిపై వేటు తప్పదన్నారు. విద్యార్థుల నుండి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా మధ్యాహ్న ఏజెన్సీలను గూర్చి తాము ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. గత ఏడాది మధ్యాహ్నం భోజన పథకం ఏజెన్సీ నిర్వాహకులు మెనూ ప్రకారం రుచికరమైన భోజనాన్ని విద్యార్థులకు అందించిన వారికి ప్రోత్సాహక బహుమతులను అందించడం జరిగింది .ఈ కార్యక్రమంలో ఎంఐఎస్ కోఆర్డినేటర్ అశ్వర్థ నారాయణ, కంప్యూటర్ ఆపరేటర్ చిదంబరెడ్డి ,సీఎంఆర్టీలు క్రిష్టప్ప నారాయణస్వామి, హరీష్ ,ఆది ,ఈ ఆర్పీ నరసమ్మ మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు ,సహాయకులు పాల్గొన్నారు.
