ఎస్ఐ చంద్రశేఖర్
జీలుగుమిల్లి :సారా స్థావరాలు పైన విస్తృతమైన దాడులు నిర్వహిస్తున్నట్లు జీలుగుమిల్లి ఎస్ఐ వీ చంద్రశేఖర రావు చెప్పారు. మండలంలోని బొత్తప్ప గూడెం గ్రామ శివారులో నాటుసారా తయారీ స్థావరాలు పైన పోలీసు సిబ్బంది దాడుల నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ఈ దాడుల్లో 100 లీ. నాటు సారాను స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. ఇదేగాక ఆ ప్రాంతంలో నిల్వ ఉంచిన బెల్లం ఉట సుమారు 2000 లీటర్లను ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు .ఈ దాడుల్లో ఒక వ్యక్తి పైన కేసు నమోదు చేసి ఎస్సీబీ స్టేషన్ కి తరలించినట్లు చెప్పారు. మండలంలో ఎక్కడైనా సారా తయారు చేస్తున్నట్లు సమాచారం ఇస్తే వారి పేర్లను ఫోన్ నెంబర్లను గోప్యంగ ఉంచుతామని వారు చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో విస్తృతమైన దాడులు చేయనున్నట్లు చెప్పారు.