మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నిర్మిస్తున్న తాజా చిత్రం ఆదిపర్వం. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో నాగలాపురం నాగమ్మ పాత్రలో ఆమె నటిస్తున్నారు. 1974 నుంచి 1992 మధ్య జరిగే ఒక పీరియడ్ డ్రామాగా ఈ సినిమాను తీస్తున్నామని దర్శకుడు సంజీవ్ ప్రకటించారు. గ్రాఫిక్స్ వర్క్ ఈ సినిమాలో చాలా హైలైట్‌గా నిలుస్తుందని చిత్రనిర్మాతలు పేర్కొంటున్నారు. అమ్మోరు, అరుంధతి చిత్రాల మాదిరిగా హైటెన్షన్ యాక్షన్ ఫిలింగా దక్షిణాది అన్ని భాషలతోపాటుగా హిందీలోనే ఈ సినిమాను విడుదల చేయబోతున్నామని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూషన్ ఘంటా శ్రీనివాస్ ప్రకటించారు. ఇంకా ఆదిత్య ఓం, ఎస్తర్ నొరోన్హా, శ్రీజిత ఘోష్, మరికొంతమంది నటీనటులు పాత్రలు పోషించారన్నారు. ఇందులో మంచు లక్ష్మి ఎంతో రిస్క్‌చేసి రెండు అద్భుతమైన పోరాట సన్నివేశాలు చేశారని చెప్పారు.