Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలునవ సమాజ స్థాపనకు సీఎం జగన్ కృషి

నవ సమాజ స్థాపనకు సీఎం జగన్ కృషి

రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

,ప్రజాభూమి విజయవాడ బ్యూరో:
నవ సమాజ స్థాపనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కృషి ఎనలేనిదని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. .నందమూరినగర్లో విస్తృతంగా పర్యటించి 145 గడపలను సందర్శించారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు తెలియజెప్పేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతోందని మల్లాది విష్ణు అన్నారు. ప్రభుత్వ యంత్రాంగమంతా ప్రజ‌ల ఇంటి వద్దకే వస్తుండటంతో సుధీర్ఘకాలం స్థానికంగా నెలకొన్న అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తోందన్నారు. అలాగే గడప గడపకు మన ప్రభుత్వంలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి సైతం ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై ఆరా తీసిన ఆయన.. నిర్ణీయ వ్యవధిలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. వార్డు సచివాలయ పరిధిలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో ఆయన కలిసి గురువారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సీఈ(ఇంజనీరింగ్) ప్రభాకర్ రావు, ఈఈ శ్రీనివాస్, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, అఫ్రోజ్, తోపుల వరలక్ష్మి, శోభన్, నేరెళ్ల శివ, మహేశ్వరి, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article