అడుగడుగున నీరాజనాలు
ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు
కామవరపుకోట :రానున్న ఎన్నికలలో దైవజనుల ఆశీర్వాద ప్రకారం మీకు విజయం సిద్ధించు గాక అంటూ చర్చి పాదర్లు అభ్యర్థులను దీవించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలలో గల చర్చిలను ఏలూరు పార్లమెంటు సభ్యులు సునీల్ కుమార్ యాదవ్ చింతలపూడి శాసనసభ్యులు ఖమ్మం విజయ్ రాజులు విస్తృతంగా పర్యటన చేశారు. వీరి ఇరువురికి అన్ని ప్రాంతాలలో పూల వర్షం కురిపించారు. అన్ని వర్గాల ప్రజలు దీవించారు.

లింగపాలెం మండలం
ధర్మాజీగూడెం గ్రామంలోని సిఎస్ఐ చర్చిలో ఈస్టర్ పండుగను పురస్కరించుకుని జరిగిన ప్రార్థనలలో పాల్గొన్నారు. అడుగడుగునా నీరాజనాలతో పాటు అక్కడ మెజార్టీతో గెలవాలని వారిని ఆశీర్వదించారు. ఆయా గ్రామాలలో ఆయా చర్చిల పాస్టర్ ప్రార్థనలు నిర్వహింప చేశారు . వీరి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
