జగ్గంపేట
జగ్గంపేట మండలం ఇర్రి పాకలో కోటి మట్టి శివలింగాలతో మహా కుంభాభిషేకం నిర్వహించి అక్కడే శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో 12 జ్యోతిర్లింగాలను ప్రతిష్టించాలని జ్యోతుల నెహ్రూ నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న 12 జ్యోతిర్లింగాల వద్ద కుటుంబ సభ్యులందరూ 12 జ్యోతిర్లింగాలకు ప్రాణ ప్రతిష్ట, పవిత్ర నది జలాలతో అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించి షిరిడి చేరుకుని సాయిబాబా దర్శనం చేసుకున్న జ్యోతుల నెహ్రూ సతీమణి జ్యోతుల మణి, జ్యోతుల లక్ష్మీదేవి, జ్యోతుల అనీష్ నెహ్రూ, చెక్కపల్లి అన్నపూర్ణ, పిఏ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. B తొందరలోనే మహా కుంభాభిషేకం, జ్యోతిర్లింగాల ప్రతిష్ట మహోత్సవం ఇర్రిపాకలో అతి వైభవంగా జరుగుతుందని జ్యోతుల మణి అన్నారు.