Wednesday, September 10, 2025

Creating liberating content

తాజా వార్తలుదెబ్బమీద దెబ్బతో దిక్కుతోచని స్థితిలో వైసీపీ

దెబ్బమీద దెబ్బతో దిక్కుతోచని స్థితిలో వైసీపీ

కింజరాపు అచ్చెన్నాయుడు

తెలుగుదేశం పార్టీ చేపట్టిన భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమానికి వస్తున్న ప్రజాధరణ, స్వచ్ఛందంగా ముందుకొచ్చి రిజిస్ట్రేషన్స్ చేసుకుంటుంటే బులుగు మందకు నిద్ర కరువైంది. మొన్నటి వరకు గడపగడపకూ వెళ్లిన వైసీపీ నేతల్ని ప్రజలు ప్రశ్నలు, నిలదీతలతో ఉక్కపోత పుట్టించారు. కానీ, టీడీపీ నేతల వద్దకు స్వచ్ఛందంగా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో అసహనంతో పిచ్చిపట్లినట్లు వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఏ కుటుంబానికి ఏయే పథకాల ద్వారా ఎంత లబ్ది చేకూరుస్తామో చెబుతున్నారు. మహాశక్తి పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధిగా మహిళలకు నెలకు రూ.1500, తల్లికి వందనంతో ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికీ ఏటా రూ.15వేలు, దీపం పథకంతో ఏటా మూడు సిలిండర్లు ఉచితం, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, యువగళం కింద నిరుద్యోగ భృతితో పాటు 20లక్షల ఉద్యోగాలు, రైతులకు అన్నదాత పథకం కింద ఏటా రూ.20వేలు, ఇంటింటికీ మంచినీటి కుళాయి, బీసీలకు రక్షణ చట్టంపై అవగాహన కల్పిస్తుంటే వైసీపీ ముఠాకు ఎందుకంత కోపం.? ప్రజలకు చేసే మేళ్ల గురించి చెబుతుంటే ఎందుకు జగన్ రెడ్డికి ఇంత అక్కసు? ఇంకెన్నాళ్లు ఇలాంటి తప్పుడు ప్రచారాలతో కాలం నెట్టుకొస్తారు? తెలుగుదేశం పార్టీ నేతలు పార్టీ మేనిఫెస్టోని వివరిస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారే తప్ప.. ఎక్కడా ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించడం లేదు. కానీ, జగన్ రెడ్డి ముఠా వాలంటీర్ల ద్వారా కుటుంబంలోని ప్రతి వ్యక్తి వ్యక్తిగత విషయాలు సైతం సేకరిస్తున్నారు. వారి కుటుంబంలో వివాహేతర సంబంధాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకుంటూ వారిని బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమాచారం మొత్తాన్ని ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ ద్వారా రామ్ ఇన్ఫోటెక్ కంపెనీకి రూ.270 కోట్లు ప్రజల సొమ్ము దోచిపెట్టి మరీ తరలిస్తున్నారు. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుండడంతో జగన్ రెడ్డి ముఠా వెన్నులో వణుకు మొదలైంది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే తప్పుడు పార్టీని 2024 ఎన్నికల తర్వాత బంగాళాఖాతంలో కలిపేయడం తధ్యం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article