ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కర్నాటి
ప్రమాదం ఏమీలేదన్న డాక్టరు
ఫోన్లో వివరాలు అడిగితెలుసుకున్న సీపీ
*ప్రజాభూమి, విజయవాడ బ్యూరో:
దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబుపై శుక్రవారం రాత్రి సమయంలో చేసిన హత్యాయత్నం కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తి రాంబాబు వెనుకగా వచ్చి గాజు సీసాతో కర్నాటిపై దాడి చేసినట్లు చెబుతున్నారు.
కడుపులో తీవ్రంగా గాయాలు కావడంతో బంధువులు ఆసుపత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణాపాయం లేదన్న డాక్టర్లు స్పష్టం చేశారు.
ఇటీవలే మరణించిన దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు తండ్రికి స్మశానంలోని తండ్రి సమాధి వద్ద దీపం పెట్టడానికి రాంబాబు వెళ్లారు. దీపం పెట్టి కాళ్లు కడుగుతున్న సమయంలో వెనుక నుండి గుర్తు తరలియని వ్యక్తి వచ్చి సీసాతో దాడి చేశాడు. దాడిని పసిగట్టి పక్కకి తప్పించుకోవడంతో గాజుసీసా కడుపులో పొడుచుకుంది. పోలీసుల నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా రాను కాటి కాపరిని తెలియజేశాడని పోలీసులు చెబుతున్నారు.
ఈ సంఘటన తెలుసుకున్న సీపీ చైర్మన్ కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు స్మశాన కాటికాపరిగానే అనుమానిస్తున్నారు.
నార్త్ ఏసీపీ రవికాంత్ విచారణ
దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబుపై హత్యాయత్నం జరిగిన అనంతరం నార్త్ ఏసీపీ రవికాంత్ మాట్లాడుతూ దుర్గగుడి చైర్మన్ పై సాయంత్రం 5 గంటల సమయంలో దాడి జరిగిందని తెలిసిందన్నారు. ఇటీవల కర్నాటి చైర్మన్ నాన్న చనిపోయారని ఆయన సమాధి వద్ద ప్రతిరోజు సాయంత్రం దీపం పెట్టేందుకు వెళుతున్నారనే సమాచారం ఉందన్నారు. సమాధి క్లీన్ చేసినందుకు దైవసహయం అనే వ్యక్తికి 200 రూపాయలు డబ్బులు కూడా ఇచ్చారు. అయితే కృష్ణ అనే వ్యక్తికి డబ్బులు తక్కువ ఇచ్చినందుకుగాను దాడి చేసినట్లు విచారణలో తేలింది. కేవలం మద్యం మత్తులో మాత్రమే గుంజా కృష్ణ దాడి చేశాడని అంటున్నారు.
దాడి చేసిన కృష్ణ పోలీసుల అదుపులో ఉన్నాడు
దాడి చేసిన వ్యక్తి స్మశానంలోనే నివాసం ఉంటున్నాడని పోలీసులు తెలిపారు.