Tuesday, February 17, 2026

Creating liberating content

తాజా వార్తలుదుర్గం మెకానిక్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ పదవ తరగతి విద్యార్థులకు చేయూత

దుర్గం మెకానిక్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ పదవ తరగతి విద్యార్థులకు చేయూత

కనిగిరి :కనిగిరి దుర్గం మెకానిక్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పదవ తరగతి పరీక్ష వ్రాయు విద్యార్థిని విద్యార్థులకు ఉచిత త్రాగునీరు ఏర్పాటు చేశారు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాల, సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, చింతలపాలెం ప్రభుత్వ పాఠశాల లో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ విద్య అనేది సమాజంలో గౌరవాన్ని సమాజం పట్ల అవగాహనాన్ని పెంపొందిస్తుందని అన్నారు అలానే తోటి వారికి చేయూతన అందించే అలవాటును ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలని, నేటి విద్యార్థులు రేపటి ఉన్నత స్థాయిలోని అధికారులుగా మనం వారిని భావించి వారికి చేతనైన వరకు వివిధ రకాల రూపంలో అందరూ వారికి చేయూతను అందించాలని కోరారు అలానే పదవ తరగతి పరీక్ష వ్రాయు ప్రతి విద్యార్థి, విద్యార్థులుఉత్తీర్ణులు కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు వారందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో దుర్గం మెకానిక్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, సెక్రెటరీ, సభ్యులు ఎం ఆదాం బేగ్, ఓబులేసు, సుధీర్ బాబు, శ్రీనివాసులు, ఫరుక్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల చీప్ ఎంఈఓ నారాయణరెడ్డి, అంజనీదేవి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article