జీలుగుమిల్లి :స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త , భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తి దాయకమని తాటియాకుల గూడెం ఎంపిటిసి సున్నం సురేష్ అన్నారు. దళిత వర్గాల అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి ప్రశంసనీయం అని అన్నారు. భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా జీలుగుమిల్లి మండలం దర్భ గూడెం గ్రామంలో అరుంధతి సంఘం ఆధ్వర్యంలో సంఘ పెద్ద జాల పెద్దిరాజు బాబు జగజ్జీవన్ రావ్ యుత్ ప్రెసిడెంట్ కలపాల రాము సమక్షంలో వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాటి ఆకులు గూడెం ఎంపీటీసీ పండు వారి గూడెం వాస్తవ్యులు సున్నం సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు ముఖ్య అదితులు మాదిగ సంఘ నాయకులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ ప్రెసిడెంట్ ఎస్సీ మాల సంఘం పెద్దలు కొమ్మరపల్లి ప్రకాశం అరుంధతి సంఘ పెద్దలు బాబు జగజ్జీవన్ రావు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.