Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలుదగా డీఎస్సీ కాదు మెగా డీఎస్సీ కావాలి

దగా డీఎస్సీ కాదు మెగా డీఎస్సీ కావాలి

మెగా డిఎస్సిని వెంటనే విడుదల చేయాలి

డివైఎఫ్ఐ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి బి మనోహర్ డిమాండ్

కడప సిటీ

శుక్రవారం9డివైఎఫ్ఐ కడప నగర కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీసు ఎదుట ఆందోళన చేపట్టారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న25వేలఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీ విడుదల చేయాలని డివైఎఫ్ఐ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శిబిమనోహర్, నగర కార్యదర్శి డిఎం ఓబులేసు డిమాండ్ చేశారు.
భారత ప్రజాతంత్ర యువజన సమఖ్య (డివైఎఫ్ఐ) కడప నగరకమిటీఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ ఎదుట,నిరుద్యోగులను మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈసందర్భంగా డివైఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి బి మనోహర్ నగర కార్యదర్శి డిఎం ఓబులేసుమాట్లాడుతూ డీఎస్సీ పోస్టుల సంఖ్యపెంచి, నోటిఫికేషన్ సమయంపెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సమస్య పరిష్కారం చేయకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను భిక్షమెత్తేలా చేసిందని అన్నారు. డిఎస్సీ పోస్టులు 25వేలు కు పెంచి మెగా డిఎస్సీ విడుదల చేయాలని,117 జీవో రద్దు చేయాలని ఈ జీవో పేరుతో 3,4,5 తరగతులను హై స్కూల్ లో విలీనం చేస్తున్నాము అని చెప్పి ద్వార 1 /40 ఉండే టిచ్చర్ రెస్యోను 3 నుండి 8 వ తరగతుల వరకు 1/53 గా 9,10 తరగతులను 1/60 టిచ్చార్ రేస్యోగా మార్చి మాకు అదనం అయిన టిచ్చార్స్ ఉన్నారు అని చెప్పి సుమారు ప్రభుత్వ పాత లెక్కల ప్రకారం 25 వేల ఖాళీ పోస్టులను 6100 కు కుదించి ప్రస్తుతం నోటిపికేషన్ ఇచ్చారు అని కావున 117 జీవో రద్దు చేసి మొత్తం ఖాళీ పోస్టులలో మెగా డీఎస్సీ విడుదల చెయ్యాలని .మరియు అప్రంటిష్ విధానాన్ని రద్దు చేయాలన్నారు.
మెగా డిఎస్సీ కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన వాగ్దానాన్ని అమలు చేస్తారని ఎదురు చూసిన వారికి తాజా ప్రకటన నిరాశపరిచిందని వెంటనే మెగా డిఎస్సీ నిర్వహించాలని . రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 25 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా కేవలం 6,100 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని ప్రకటించడం సరైనదికాదని . రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, విద్యా అనుబంధ రంగాల పోస్టులన్నీ భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని డివైఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నామని అన్నారు.రాష్ట్రంలో 10లక్షల పైగా నిరుద్యోగులుబిఈడి, టిటిసి పూర్తి చేసి అప్పులు చేసుకొని కోచింగ్ తీసుకుంటూ సంవత్సరాలుగా కాలం వెలగక్కుతూ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అనిఎదురు చూస్తున్నారని కానీ రాష్ట్ర చరిత్రలో ఏనాడు లేని విధంగా ఈ ఐదుసంవ్సతరాల కాలంలో ఒక్క డిఎస్సీ కూడాప్రకటించలేదని, సుదీర్ఘకాలంగా యువజనసంఘాలు, నిరుద్యోగ యువత పోరాడిన ఫలితంగా కంటి తుడుపు చర్యగా 6,100 పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారని, ఇది డీఎస్సీ అభ్యర్ధులను మోసగించే చర్య అని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన సంఖ్యను చూసి లక్షలాది మంది యువతనిరుత్సాహం చెందుతున్నారని, ఇవికూడాఅన్నిజిల్లాలు, కేటగిరీలను సమగ్రంగారూపొందించలేదని. ప్రకటించిన డిఎస్సీ లో కూడా అనేక నిబంధనలు పెట్టారు. ఎప్పుడో రద్దు చేసిన అప్రెంటిస్ విధానాన్నిపునఃప్రవేశపెట్టి రెండేళ్ళు గౌరవ వేతనం ఇస్తామని ప్రకటించడంఅన్యాయం. రాష్ట్రంలో వివిధరకాలఉపాధ్యాయపోస్టులుసుమారు 25 వేలుఉన్నాయని . ఇవిగాక రానున్న జూన్లోమరిన్నిపోస్టులుఖాళీఅవుతున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మెగాడిఎస్సీప్రకటించాలి లేని పక్షంలో డివైఎఫ్ఐ గా పెద్ద ఎత్తునధర్నానిర్వహిస్తామని చెప్పడం జరిగింది.ఈకార్యక్రమంలో బి వై ఎఫ్ ఐమాజీజిల్లానాయకులుపివెంకటసుబయ్య, పి చంద్రారెడ్డి, నగర ఉపాధ్యక్షులు విజయ్ నాయకులు ఉదయ్, వెంకటరామయ్య, మరియు డీఎస్సీ అభ్యర్ధులు శ్రీనివాస్, శివ, జాన్, సుంకన్న, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article