మార్కాపురం
మండల మరియు తర్లుపాడు మండలాల క్లస్టర్ ఇంచార్జీలు, యూనిట్ ఇన్చార్జిలు మరియు బూత్ ఇన్చార్జిల ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రాం మార్కాపురం పట్టణంలోని బోడపాడు రోడ్డులో ఉన్న మాజీ మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ మల్లికార్జున ఫ్లాట్స్ నందు జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి విచ్చేశారు. అనంతరం ట్రైనర్స్ క్లస్టర్ ఇంచార్జిల, యూనిట్ ఇన్చార్జిల, బుత్ ఇన్చార్జిల కు ట్రైనింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ వచ్చే నాలుగైదు రోజుల్లో ప్రతి బూత్ ఇన్చార్జులు, యూనిట్ ఇన్చార్జిలు, క్లస్టర్ ఇంచార్జ్ లు, బాట్ అప్లికేషన్ లో ఉన్న తమకు సంబంధించిన బూత్ లలో ఓటర్ వెరిఫికేషన్ ఫామ్స్ లో ఉన్న ఫామ్ 6, ఫామ్ 7 ఫామ్ 8 లను ప్రతి ఒక్కటి జాగ్రత్తగా వెరిఫై చేసి అప్లోడ్ చేయాలని, దాంట్లో ఎటువంటి అవకతవకలు ఉన్నా తక్షణమే సంబంధిత బిఎల్ఓ లకు లికిత పూర్వకంగా కంప్లైంట్ చేయాలని తెలియజేశారు. తక్షణమే భవిష్యత్తు గ్యారంటీ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని క్లస్టర్ ఇంచార్జిలకు, యూనిట్ ఇన్చార్జిలకు, బూత్ ఇన్చార్జిలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ క్లస్టర్ మేనేజ్మెంట్ ఇంచార్జి కందుల రామిరెడ్డి మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జీలు, యూనిట్ ఇన్చార్జీలు, బూత్ ఇన్చార్జిలు పాల్గొన్నారు.

