జన సునామితో జగ్గంపేటలో చైతన్య రథంపై ఎన్నికల ప్రచారం నిర్వహించిన టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ
జగ్గంపేట

జగ్గంపేట టౌన్ లో చైతన్య రథంపై భారీ ప్రజా స్పందన నడుమ టిడిపి, జనసేన శ్రేణులతో కలసి విస్తృతంగా పర్యటించిన వారు సూపర్ సిక్స్ పధకాలు, ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్బంగా జ్యోతుల నెహ్రూ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ గత అయిదేళ్ల పాలనను ప్రజలందరూ చూసారని, వైకాపా నేతలు ఏమీ చేసారో అందరికి తెలిసిందేనన్నారు. ఒక్క అభివృద్ధి పని చేయలేని అసమర్ధ పాలకులని దుయ్యబట్టారు. మీట నొక్కడమే గాని లబ్దిదారులకు న్యాయం జరిగింది లేదన్నారు. చివరకు ఎన్నికల్లో విజయం కోసం పండుటాకుల ప్రాణాలతో రాజకీయం చేసే స్థాయికి దిగజారిపోయారని విమర్శించారు. బ్యాంకు అకౌంట్లో పింఛన్లు పడతాయన్న భరోసా కూడ నేతలు కల్పించకపోవడంతో.. అన్ని పధకాల లాగానే పింఛను డబ్బులు పడ్డాయా లేదా అన్న అనుమానం వృద్ధుల్లో ఎక్కువైందని చెప్పారు. ఇదీ ఈ ప్రభుత్వానికి ప్రజల్లో వున్న విశ్వాసం అని ఎద్దేవా చేసారు. ఎన్దియేని ఎదుర్కొనే సత్తా లేక వాలంటీర్లను తొలగిస్తారని, పధకాలు రద్దు చేస్తారని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్మోహన రెడ్డి నియంతృత్వ పోకడలతో రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. ఎన్దియే హయాంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోసంక్షేమరాజ్యం రానుందని చెప్పారు. సూపర్ సిక్స్ పధకాలతో సంక్షేమం, మేనిఫెస్టోతో అన్నివర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. చంద్రబాబును మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలని, నియోజకవర్గంలో కూటమిఅభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు సైకిల్ గుర్తు పైన, కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ కు గాజు గ్లాస్ గుర్తుపైన ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నెహ్రూ పిలుపునిచ్చారు. విద్యా వైద్యం, సాగునీరు త్రాగునీరు, ఉద్యోగ ఉపాధి ఈ ఈ నాలుగు అంశాలు ప్రామాణికంగా రాబోయే ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


