Sunday, February 15, 2026

Creating liberating content

తాజా వార్తలుతెలంగాణ వాహన రిజిస్ట్రేషన్లలో ఇక 'టీఎస్' కాదు… 'టీజీ'

తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్లలో ఇక ‘టీఎస్’ కాదు… ‘టీజీ’

రాష్ట్ర చిహ్నంలోనూ మార్పులు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వాహన రిజిస్ట్రేషన్లలో ఇప్పటిరకు నెంబరుకు ముందు రాష్ట్రం పేరును సూచించేలా టీఎస్అ నే అక్షరాలు ఉండేవి. ఇప్పుడు ‘టీఎస్’ అనే అక్షరాలు కనుమరుగు కానున్నాయి. టీఎస్ స్థానంలో ఇకపై టీజీ అనే అక్షరాలు రానున్నాయి. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కులగణన నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర అధికారిక గీతంగా ‘జయ జయహే తెలంగాణ’ను ప్రకటించారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర చిహ్నంలో తెలంగాణ ఆత్మ, స్ఫూర్తి ప్రతిబింబించేలా మార్పులు చేయాలని నిర్ణయించారు. ఆరు గ్యారెంటీలపై లోతుగా చర్చించిన అనంతరం రెండు గ్యారెంటీల అమలుకు నిర్ణయం తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article