హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని మారుస్తామని ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. రాజ్యంగ స్పూర్తితో ప్రజాస్వామ్యం, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా కొత్త చిహ్నం తీసుకొస్తామన్నారు. వాహన రిజిస్ట్రేషన్ కోడ్‌ను టీఎస్ నుంచి టీజీగా మార్పు చేశామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రూ. 2.75లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ ను రూపొందించారు. ఈ మేరకు అసెంబ్లీలో రూ.2.75,891 కోట్లతో 2024-25 తెలంగాణ బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయాలన్నది మా లక్ష్యమన్నారు. మా ప్రభుత్వ హామీలలో మరో ముఖ్యమైన రెండు హామీలు గృహజ్యోతి మరియు 500/- రూపాయలకే వంట గ్యాస్ సిలెండర్ సరఫరా చేస్తామని వివరించారు.