వేలేరుపాడు,
తెలంగాణ రాష్ట్రం నుంచి ,ఆ రాష్ట్ర మద్యాన్ని ఆంధ్రలోని వేలేరుపాడు మండలం కట్కూరు గ్రామంలో విక్రయిస్తున్న, ముత్తిక రాంబాబు అనే వ్యక్తిని, లక్ష రూపాయల మద్యంతో పాటు స్వాధీనం చేసుకున్నట్లు వేలేరుపాడు పోలీసులు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు, రాంబాబు గత కొంతకాలంగా మధ్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్నారన్న సమాచారం మేర, గురువారం సరిహద్దులోని మేడిపల్లి గ్రామం వద్ద చెక్పోస్టులో పట్టుకున్నట్లు ఎస్సై లక్ష్మీనారాయణ తెలిపారు. రాంబాబు ఓ ప్రైవేటు వాహనంలో తెలంగాణ మద్యం ఎంహెచ్ 104 బాటిళ్లు, ఓ ఏ బి 160 బాటిళ్ళు, నాకౌట్ బీర్లు 371, వీటి విలువ దరిదాపు లక్ష రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు సదరు మద్యంతో పాటు రాంబాబును, వాహనాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మీనారాయణ తెలిపారు.