హిందూపురంలో ఘనంగా జయహో బీసీ సదస్సు
హిందూపురంటౌన్ :తెదేపా ఎదుగుదల బీసీలతోనే సాధ్యమని తెదేపా బీసీ నాయకులు పేర్కొన్నారు. పట్టణం లోని పాండురంగనగర్ కనకదాసు కళ్యాణమంటపంలో సోమవారం 7వ క్లస్టర్ ఇన్చార్జి. 25వ వార్డు కౌన్సిలర్ ఎస్ఆర్ రాఘవేంద్ర ఆధ్వర్యంలో జయహో బీసీ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు కు పట్టణంలోని బీసీలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ జెవీ అనిల్ కుమార్, బేవినహళి ఆనంద్, జనసేన పార్టీ నాయకులు చంద్రశేఖర్, బీసీ సెల్ పట్టణాధ్యక్షుడు నవీన్, పార్టీ నాయకులు అమర్నాథ్, పరిమళ, భాస్కర్, నబీరసూల్, శివశంకర్, వెంకటేశ్, చెన్నమ్మ, విజయలక్ష్మీ, మోదా శివకుమార్, నాగేంద్ర, మురళీ, శశికళ తదితరులు పాల్గొని మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావించినప్పటి నుంచి బీసీలకు పార్టీ అండగా నిలిచిందన్నారు. బీసీలకు తెదేపాతోనే న్యాయం జరుగుతుందన్నారు. నేడు బీసీలు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు పార్టీ ఎంతో తోడ్పడిందన్నారు. బీసీలకు ఆనాడు ఎన్టీరామారావు నేడు చంద్రబాబునాయడు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఉన్నత పదవులు కట్టబెట్టారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీలు ఐక్యమత్యంగా ఉంటూ తెదేపా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టిడిపి శ్రేణులు పాల్గొన్నాయి.