Saturday, November 8, 2025

Creating liberating content

టాప్ న్యూస్తిరుపతి నగరంలో అనధికార హోమ్‌స్టేలు

తిరుపతి నగరంలో అనధికార హోమ్‌స్టేలు

  • ప్రభుత్వ ఆదాయానికి కోట్లల్లో గండి
  • అధికారుల తీరు పెరుమాళ్ కేరుక

ప్రజాభూమి ప్రత్యెకప్రతినిధి (తురక అమరనాథ్) – తిరుపతి

ఆధ్యాత్మిక నగరం కలియుగ వైకుంఠంగా పిలవబడే తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలో ఉండటంతో ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తుంటారు. ఈ సందర్భాన్ని అదునుగా చేసుకొని కొందరు వ్యక్తులు శక్తులుగా మారి భక్తులను దోచుకునేదే కాక ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. తిరుపతిలో అనధికార హోమ్‌స్టేలు వేగంగా విస్తరిస్తున్న సమస్య ప్రభుత్వం ఆర్థికంగా ఎదుర్కొనే పెద్ద సమస్యగా మారింది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ అధికార యంత్రంగానికి తెలియదా అంటే అది అది పెరుమాళ్ కేరుక! అన్న తీరు కనిపిస్తుంది. స్థానికులు, వ్యాపార వర్గాలు, పర్యాటకులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ హోమ్‌స్టేలు ద్వారా వసూలు చేయాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజులు, పన్నులు, విద్యుత్, ఇతర సేవల చార్జీలు సరిగ్గా వసూలు కావడం లేదు. ఫలితంగా, ప్రభుత్వానికి సంవత్సరానికి కోట్ల రూపాయల ఆదాయం కోల్పోతున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికీ ఈ హోమ్‌స్టేలు పర్యాటకులకు తాత్కాలిక సౌకర్యాలను అందిస్తున్నాయి. కానీ, రిజిస్ట్రేషన్, భద్రతా ప్రమాణాలు, పన్ను విధానం లేకపోవడం వల్ల, ప్రభుత్వం నేరుగా నష్టాన్ని భరించాల్సి వస్తోంది. స్థానిక వ్యాపారులు, రియల్ ఎస్టేట్ రంగంలో కార్యకలాపాలు చేస్తున్న వారు, ఆన్‌లైన్ బుకింగ్స్ ద్వారా అధిక ఆదాయం పొందుతున్న ఈ హోమ్‌స్టేల కారణంగా స్థానిక వసూలు విధానాలపై ప్రతికూల ప్రభావం ఏర్పడుతోందని చెబుతున్నారు.

విశ్లేషణలో వెల్లడించిన వివరాల ప్రకారం, తిరుపతిలోని ఎక్కువ హోమ్‌స్టేలు అధికారికంగా, రిజిస్ట్రేషన్ లేకుండా, పన్నులు చెల్లించకుండా, విద్యుత్ చార్జీలను సమర్థవంతంగా తీర్చకుండా నడుస్తున్నాయి. ఇది ప్రభుత్వానికి కోట్లు రూపాయల నష్టాన్ని కలిగిస్తున్న ప్రధాన కారణం. స్థానిక అధికారులు నిర్లక్ష్యం వహించడం, కాసుల కోసం కక్కుర్తి పడటం వల్ల ఈ పరిస్థితి మరింత తీవ్రమవుతోంది. సరైన పర్యవేక్షణ లేకపోవడం, రిజిస్ట్రేషన్, లైసెన్సింగ్ ప్రక్రియలను పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల రాష్ట్రం ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోందని పౌర సంఘం హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే కఠిన పర్యవేక్షణ, రిజిస్ట్రేషన్, భద్రతా ప్రమాణాలు, పన్ను విధానాలను అమలు చేయకపోతే, అనధికార హోమ్‌స్టేలు మరింతగా విస్తరిస్తాయని, ఈ సమస్య భక్తులకు, పర్యాటకుల భద్రతకు, స్థానిక వాణిజ్య రంగానికి, రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని వారు చెప్పారు. విశ్లేషకులు, ఈ సమస్యను చట్టపరమైన చర్యల ద్వారా నియంత్రించడం అత్యవసరమని సూచిస్తున్నారు. తద్వారా, తిరుపతి పరిసర ప్రాంతాల్లో హోమ్‌స్టే పరిశ్రమను ప్రభుత్వానికి నష్టం చేకూర్చకుండా, నిబంధనలకు అనుగుణంగా కొనసాగించవచ్చని వారు పేర్కొన్నారు. స్థానిక అధికారులు సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తూ, కఠిన చర్యలు చేపట్టి, అనధికార హోమ్‌స్టేల పెరుగుదలను అదుపులో ఉంచాలని బాధ్యత గల పౌరులు సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article