ప్రజాభూమి వరదయ్యపాలెం
ఈ నెల 26 న సూళ్లూరుపేట లో జరుపతలబెట్టిన చేనేత కార్మిక సదస్సును జయప్రదం చేద్దాం అని చేనేత కార్మిక యూనియన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు జక్కల మునస్వామి పిలుపునిచ్చారు.చేనేత పరి రక్షణ,చేనేత వృత్తి ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ,భవిష్యత్ కార్యక్రమం,తదితర విషయాలు పై సమాలోచన జరుగుతుందని తెలిపారు.అల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ తిరుపతి జిల్లా నూతన కమిటీ ఏర్పాటు కు ప్రత్తిపాదనలు ఉంటుందని తెలిపారు.చేనేత కుల సంఘాలు,చేనేత కార్మిక సంఘాలు,వివిధ రాజకీయ చేనేత విభాగం,చేనేత శ్రేయోభిలాషులు,ప్రతినిధులు తదితరులు పాల్గొంటారు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక యూనియన్ మహిళా నాయకురాలు బుర్రా తిరుపతమ్మ,మండల కన్వినర్ మాచర్ల శేఖరయ్య,సీనియర్ నాయకులు బుర్ర కృష్ణమూర్తి,గులపల వెంకటరమణయ్య,కల్లూరు వెంకటేష్,చేనేత జాతీయ మీడియా సలహాదారు గుత్తి త్యాగరాజు పాల్గొన్నారు.