వి అర్ పురం
కొత్తగా విఆర్ పురం తాసిల్దారుగా బాధ్యతలు చేపట్టిన సయ్యద్ మౌలానా పాజిల్ ను. బుధవారం ఎమ్మార్వో కార్యాలయంలో జనసేన మండల అధ్యక్షులు మలకాల సాయికృష్ణ మండల కమిటీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో మూడు నెలల పాటు ఎలక్షన్ కమిషన్ బదిలీల్లో భాగంగా ప్రభుత్వం ఇక్కడ నియమించడం జరిగిందని అన్నారు. తమ పరిధిలో అయ్యే ప్రతి అర్జిని పరిష్కారం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం జనసేన మండల కమిటీ ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించింది పూల బుకే ఆయనకు అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు ములకాల సాయికృష్ణ, ఉపాధ్యక్షులు కనుగుల శ్రీనివాసరెడ్డి, బాగులప్రమీల, నాయకులు కెచ్చెల పోసిరెడ్డి, మండల కార్యదర్శి బాగుల అంజన్ రావు, పెట్టా నాగేంద్రబాబు, సాగర్, రేవు దుర్గా ప్రసాద్, కోట్ల రాజా రెడ్డి, కే సాయిబాబు, పరంకుశం మణికంఠ, మిడి యం దుర్గా ప్రసాద్, కుక్కు నూరు మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.