Friday, May 2, 2025

Creating liberating content

సినిమాతమన్నాతో పెళ్లి ఎప్పుడంటే…

తమన్నాతో పెళ్లి ఎప్పుడంటే…

బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ , తమన్నాల రిలేషన్షిప్ కేవలం కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారింది.వీరిద్దరూ లస్ట్ స్టోరీస్ -2 అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న సమయంలో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.అయితే వీరిద్దరూ తక్కువ సమయంలోనే ప్రేమలో పడ్డప్పటికీ ఈ విషయాన్ని కూడా ఎక్కువ రోజులు సీక్రెట్ గా ఉంచలేకపోయారు. ఎందుకంటే వీరికి సంబంధించిన పర్సనల్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టడంతో అవి కాస్తా నెట్టింట్లో వైరల్ అయి వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ బయటపడింది.ఇక అందరు సెలబ్రిటీస్ లా వీరు తమ రిలేషన్ ని సీక్రెట్ గా ఉంచాలి అనుకోలేదు. ఈ విషయం బయటపడ్డ కొద్ది రోజులకే తాము నిజంగానే ప్రేమలో ఉన్నాము అనే విషయాన్ని చెప్పారు. కానీ పెళ్లి మాత్రం ఇప్పుడే కాదు అంటూ కూడా చెప్పారు. అయితే తాజాగా విజయ్ వర్మ తమన్నా తో పెళ్లి గురించి ఒక అభిమానికి ఇచ్చిన రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. మరి ఇంతకీ విజయ్ వర్మ పెళ్లికి సంబంధించి ఎలాంటి న్యూస్ బయట పెట్టారు అనే సంగతి చూస్తే..హైదరాబాద్ కుర్రాడైన విజయ్ వర్మ బాలీవుడ్ లో నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలా కొనసాగుతున్న ఈయన తమన్నాతో ప్రేమలో పడ్డారు. అయితే తాజాగా తన అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్ చేస్తున్న సమయంలో ఎన్నో ప్రశ్నలు ఆయనను అడిగారు.ఇక అందులో భాగంగా ఒక అభిమాని కబ్ షాదీ కర్రే అంటే మీ పెళ్లెప్పుడు అని అడిగారు. దానికి విజయ్ వర్మ ఒక వింత సమాధానం ఇచ్చారు. ఇదే ప్రశ్న నేను హైదరాబాదుకు వెళ్ళినప్పుడు కూడా వినిపించింది. అలాగే నా మేనకోడలు కూడా మా అమ్మను అడుగుతుంది అంటూ పెళ్లి ఎప్పుడో చెప్పకుండా వింత సమాధానం ఇచ్చి తప్పించుకున్నారు. అయితే సినీ ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం వీరి పెళ్లి ఈ ఏడాది ఉండబోతుందని తెలుస్తోంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article