తనకల్లు:తనకల్లు మండలం బూడిద గడ్డ వీధిలో నివాసం ఉంటున్న వెంకటరమణ( 35)అనే రైతు నిన్నటి దినం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. జీవనోపాధికోసం తనకల్లు నుండి కోక్కంటి క్రాస్ దగ్గర ఉన్న పాపాగ్ని నదిలో ఎద్దుల బండి పై ఇసుక తోలుతూ జీవనోపాధిని కొనసాగిస్తున్నారు, కుటుంబపెద్దనుకోల్పోవడం చాలా బాధాకరం,వారికి భారతీయ జనతా పార్టీ నాయకులు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు హసనాపురం చంటి ఆర్థిక సహాయంగా రూ.10వేలు సహాయం చేసారు. వారి పిల్లల చదువులకు సహాయం చేస్తామని. ఆధైర్యపడవద్దని, వారి కుటుంబానికి భోరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు రాజన్న, మైనార్టీ మోర్చ జిల్లా ఉపాధ్యక్షు బావ ఫక్రుద్దీన్, గిజన మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మినారాయణ, జానకిరామ్, మాజీ ఎస్సీ మోర్చ జిల్లా కార్యదర్శి నరేష్ జిల్లా కార్యవర్గ సభ్యుడు వేమనారాయణ, జానకిరామ్, మల్లికార్జున, రమేష్ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.