ప్రజాభూమి బ్యూరో, అనంతపురము
విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి శుక్రవారం డ్రాఫ్ట్ పబ్లికేషన్ పై
రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్
ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. డ్రాఫ్ట్ పబ్లికేషన్
రోజున పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల స్థితి, ప్రత్యేకంగా 30 రోజులకు పైగా పెండింగ్‌లో ఉన్న ఫారమ్‌లు, ఎస్ఎస్ఆర్- 2024 సమయంలో స్వీకరించిన ఫారమ్‌లు, అనోమలిస్ పెండింగ్, ముసాయిదా జాబితాపై ఓట్ల చేర్పులు, తొలగింపులు, సవరణలు, పెండింగ్ రాజకీయ పార్టీల ఫిర్యాదులు, ఈ-రోల్‌పై రిపోర్ట్ లు, ఎపిక్ కార్డుల జనరేషన్, పంపిణీ, పీఎస్ఈలు, డీఎస్ఈలు, తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
అనంతపురం కలెక్టరేట్ లోని వీసీ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి, డిఆర్ఓ గాయత్రీ దేవి, తదితరులు హాజరయ్యారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్డీవోలు గ్రంధి వెంకటేష్, రాణి సుష్మిత, సి.శ్రీనివాసులురెడ్డి, డిప్యూటీ కలెక్టర్ రవీంద్ర, ఈఆర్ఓలు సుధారాణి, వెంకటేశ్వర్లు, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసిల్దార్ కనకరాజు, సీనియర్ అసిస్టెంట్ శామ్యూల్, ఎలక్షన్ డిటిలు, తదితరులు పాల్గొన్నారు.