రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 6,100 టీచర్ పోస్టుల భర్తీ కోసం నేడు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేశారు. అందులో ఎస్జీటు 2,280 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ 2,299 పోస్టులు, టీజీటీలు 1,264 పోస్టులు, పీజీటీలు 215, ప్రిన్సిపల్స్ 42 పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 21 వరకు ఫీజు చెల్లింపు గడువు,ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తుల స్వీకరణ,మార్చి 5 నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడింగ్ కు అవకాశం,మార్చి 15 నుంచి మార్చి 30 వరకు ఆన్ లైన్ విధానంలో పరీక్షలు,ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి సెషన్,మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్.