పోరుమామిళ్ల:రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకునే విధంగా ఏపీ ఫుడ్ కమిషన్ చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి, యువనాయకులు డిసి ఆదిత్యనాథ్ రెడ్డి రంగసముద్రం సర్పంచ్ చిత్తా రవి ప్రకాష్ రెడ్డి, టేకురుపేట సర్పంచ్ కల్లూరు రమణారెడ్డి, టేకురుపేట పంచాయితీలో డోర్ టు డోర్ కాన్వాస్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి బలపరిచిన కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధమ్మని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేసిందని అర్హుడైన ప్రతి ఒక్కరికి పథకాలు అందజేశామని మరొకసారి అవకాశం ఇవ్వవలసిందిగా కోరారు యువ నాయకుడు చిత్తా గిరిప్రణీత్ రెడ్డి, జెడ్పిటిసి ముత్యాల ప్రసాద్, బాల్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, జయన్న, సత్యనారాయణ, అల్లూరిరెడ్డి పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
