కడప సిటీ
ఫిబ్రవరిల8ఎస్ఎఫ్ఐ, యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8వ తేదీన పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన ప్రజ్ఞ వికాసం మోడల్ టెస్టు పరీక్ష విజయవంతం చేయాలని ఎస్.ఎఫ్.ఐ, యు.టి.ఎఫ్ నాయకులు తెలిపారు. గురువారం ఎస్.ఎఫ్.ఐ, యు.టి.ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజ్ఞ వికాసం పరీక్ష ప్రశ్నాపత్రం ను స్థానిక గాంధీనగర్ మున్సిపల్ స్కూల్ నందు భీరం శ్రీధర్ రెడ్డి విద్యాసంస్థల అధినేత భీరం సుబ్బారెడ్డి ,యు.టి.ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీ రాజా, ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి గండి సునీల్ కుమార్, యు.టి.ఎఫ్ జిల్లా కార్యదర్శి మహేష్, ఎస్.ఎఫ్.ఐ మాజీ రాష్ట్ర సహాయ కార్యదర్శి సగిలి రాజేంద్ర ప్రసాద్ లు మాట్లాడుతూ.
విద్యార్థులలో పబ్లిక్ పరీక్షలు అంటేభయం పోగొట్టేందుకుఎస్.ఎఫ్.ఐ, యు.టి.ఎఫ్ ప్రతి సంవత్సరం ప్రజ్ఞా వికాసం పరీక్షలు నిర్వహిస్తూ ఉందని, ఈ పరీక్ష పేపర్ను ప్రముఖ విద్యావేత్త కే.ఎస్ లక్ష్మణరావు తయారు చేయడం జరిగిందన్నారు. ఈ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మండల స్థాయిలో మొదటి మూడు బహుమతులు, జిల్లా స్థాయిలో టాప్ 10 ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడంజరుగుతుందన్నారు. ఈ పరీక్షలో ప్రతిభ కనపరచిన పేద విద్యార్థులకు భీరం విద్యాసంస్థల్లో ఉచితవిద్యఅందిస్తామనిభీరంవిద్యాసంస్థల అధినేతసుబ్బారెడ్డి గారు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటువిద్యాసంస్థలలో చదివేటువంటి విద్యార్థులంతా ఈ పరీక్షకు హాజరై విజయవంతం చేయడం జరిగిందని వారందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి మనోజ్, దేవకుమార్, యుటిఎఫ్ నాయకులు మేరీ లు పాల్గొన్నారు.