కదిరి :రాష్ట్ర ముఖ్యమంత్రి, సంక్షేమ సారథి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలు, విధి విధానాలకు ఆకర్షితులై మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులో షమీల్, ఇమ్రాన్ ఆధ్వర్యంలో టీడీపీ నుంచి అమ్మజాన్, షబానా, షాహినా, కే. గంగులమ్మ, ఉష, రేష్మ, నౌజీ, సోనీ, భాను, శ్రీనిజ, జయమ్మ, భాస్కర్ రెడ్డి, రామచంద్రా రెడ్డి తదితరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మంగవారం ఆ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్ మక్బూల్ కండువాలు వేసే పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని నిరుపేదలకు అండగా నిలుస్తూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమంతో వారు మరింత అభివృద్ధి చెందాలనే జగనన్న ఆశయాలను నెరవేర్చడానికి పార్టీలో చేరామన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్ మక్బూల్ నాయకత్వాన్ని బలపరుస్తూ నియోజకవర్గంలో ముచ్చటగా మూడోసారి వైసీపీ జెండా ఎగరవేయడానికి మా వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ జోనల్ ఇంచార్జ్ లింగాల లోకేశ్వర్ రెడ్డి, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

