Sunday, February 15, 2026

Creating liberating content

తాజా వార్తలుటీడీపీలోకి వలసల పర్వం

టీడీపీలోకి వలసల పర్వం

కదిరి :తెలుగుదేశం పార్టీలోకి వలసల పర్వం సాగుతోంది. టీడీపీ అభ్యర్థి కందికుంట యశోద దేవిని గెలిపించుకోవాలనే తపనతో పార్టీలో చేరుతున్నట్లు చేరిన వారు అంటున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కదిరి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని చంద్రబాబు నాయుడుకి గిఫ్ట్ ఇస్తామంటున్నారు. సోమవారం కదిరి పట్టణం మదనపల్లి రోడ్డులోని పీవీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో నల్లచెరువు మండలం బాలేపల్లి తండా పంచాయతీ రాజమోల్లపల్లి తండాకి చెందిన సుమారు 15 కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి కదిరి తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. పార్టీ లో చేరిన వారు ముత్యాలమ్మ, రాజు నాయక్, శివ నాయక్, నాగేంద్ర నాయక్, వెంకటరమణ నాయక్, సాయి కుమార్, త్రిచెంద్ర, భీంలా నాయక్, రెడ్డప్ప నాయక్, అనిల్ నాయక్, హనుమంతు, బి.పీరా నాయక్, వి.రమణ నాయక్, బి. శీన నాయక్, గోపాల్ నాయక్ తదితరులను కందికుంట పార్టీ కండువాలు కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రాజశేఖర్, పి.వెంకట రమణ, బి.గోవింద్ నాయక్, సోమ్లా నాయక్, గంగా రాజు నాయక్, గోవింద్ నాయక్, మండల నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article