Tuesday, November 18, 2025

Creating liberating content

తాజా వార్తలుటీడీపీకి వెన్నుముక బీసీలు.!అభివృద్ధి చేసే భాద్యత తీసుకుంటాం: పులివర్తి నాని..

టీడీపీకి వెన్నుముక బీసీలు.!అభివృద్ధి చేసే భాద్యత తీసుకుంటాం: పులివర్తి నాని..

డికేటి భూములు రెగ్యులరైజ్ చేస్తా‌…!!
ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్దే లక్ష్యంగా పని చేస్తా”పులివర్తి నాని”

చంద్రగిరి:
ఊహించని జనం… అంతు చిక్కని అభిమానం‌.. పరవళ్ళు తొక్కిన ఉత్సాహం.. కేరింతలు కొట్టే యువతతో జయహో బిసి సభ విజయవంతమైందని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. చిన్నగొట్టికల్లు, యర్రావారిపాళెం మండల బిసి నేతలతో బుధవారం నిర్వహించిన జయహో బిసి కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పులివర్తి నాని, జనసేన ఇన్చార్జి దేవర మనోహర్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ జయహో బిసి సభకు అధికార పార్టీ నేతలు అడ్డంకులు సృష్టించినా ఊహించని జనం రావడం చూస్తుంటే లక్ష ఓట్లు మెజారిటీ రావడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్ర పరిస్థితి ఏవిధంగా ఉందో ఆలోచించాలని సూచించారు. బిసిల కోసం 13 కార్పోరేషన్ ఏర్పాటు చేసి 50 నుంచి 150 కోట్లు నిధులు మంజూరు చేసింది టీడీపీనేనని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం 50 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు చేయలేదని ఆరోపించారు. బిసిలకు లోన్లు పనిముట్లు టీడీపీలోనే వచ్చేవని, ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటే పథకాలు మంజూరు అయ్యేవని అన్నారు. గతంలో టీడీపీకి చెందిన ఎన్ఆర్ఐ అబ్దుల్ ఆలీ భాకరాపేటలో పరిశ్రమ స్థాపిస్తే … వైసీపీ ప్రభుత్వం కాంపౌండ్ వాల్ తొలగించారని చెప్పారు. ఆయనకు బలవంతంగా వైసీపీ కండువా కప్పారని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని 6 మండలాలు అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానన్న ఆయన తలకోన కు డబుల్ రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ హయాంలో గల్లా అరుణ కుమారి తలకోన సిద్దేశ్వర ఆలయం అభివృద్ధికి కృషి చేసిందని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పారు. గెలిచిన మొదటి 5 ఏళ్ల లో ప్రభుత్వం అధికారంలో లేదన్న ఎమ్మెల్యే రెండవ సారి జగన్ ఒక్క అవకాశం నినాదంతో గెలిచి నియోజకవర్గ ప్రజలకు కనుమరుగయ్యారని చెప్పారు. ఈ నాలుగున్న ఏళ్లలో 5 వేలు కోట్లు సంపాదించాడని పేర్కొన్నారు. ఒక్క అవకాశం ఇస్తే కుటుంబ సభ్యుడులా అండగా ఉంటానన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతల డికేటి భూములు పై కేసులు వేశారని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో డికేటి భూములు రెగ్యులరైజ్ చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. అలాగే అధికారంలోకి వచ్చిన నెలలో ఎన్ ఆర్ ఈ జి ఎస్ పనులు ప్రతి రైతుకు వచ్చేలా చేస్తానన్నారు. ఈ రెండు మండలాల్లో గతంలో 4200 ఓట్లు మైనస్ అని ఈసారి 8400 ఓట్లు మెజారిటీ రావాలన్నారు. రేషన్ బియ్యం 10 కేజీలు ఇవ్వాల్సి ఉండగా 5 కేజీలు ఇస్తు మిగిలిన 5 కేజీలను కార్వేటినగరం లోని బీరు ఫ్యాక్టరీకిఅమ్ముకుంటున్నారని అన్నారు. ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇవ్వండి భాకరాపేట నుంచి ఎర్ర వారి పాలెం వరకు 30 అడుగులు రెండు మండలాలకు అనుసంధానంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని చంద్రగిరి నియోజకవర్గ ఆరు మండలాలు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని పులివర్తి నాని తెలిపారు. జయహో బిసి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు తెలుగుదేశం, జనసేన పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article