బీటెక్ రవిని గెలిపించడమే మా ధ్యేయం
పులివెందుల :పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని చిన్న కొండా రెడ్డి కాలనీలో నివాసముంటున్న10 మైనార్టీ కుటుంబాలు టిడిపి పార్టీలో రాష్ట్ర కార్యదర్శి తూగుట్ల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేర్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీటెక్ రవి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తామని వారన్నారు. కూటమి మేనిఫెస్టో నచ్చి పార్టీలో చేరినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లగారి భాస్కర్ రెడ్డి, మహబూ బ్ బాషా ,కాశీం వలి, టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

